మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ

న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్  వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్‌డౌన్‌ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది.  ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. 




దేశవ్యాప్తంగా జిల్లాలను  రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది.  తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో  కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు  అందించిన వివరాల ప్రకారం  ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!)